Among/Amongst

Amid లాగా నే ఇది కూడా ఒకే అర్థాన్ని ఇస్తుంది . కాకపోతే Amid అనేది uncountable nouns కి వాడతాము .Countable nouns కి Among వాడతము 
1. కొందరు మనుషుల మధ్య లేదా కొన్ని  వస్తువుల మధ్య అని చెప్పేటప్పుడు 
  The politician is standing among the crowd. 
  ఆ జనల మధ్యలో ఆ రాజకీయ నాయకుడు నిలుచున్నాడు . 
 There is a house among the trees 
 ఆ చెట్ల మధ్య ఒక ఇల్లు ఉన్నది 

2. ఏదైనా కొందరు మనుషుల మధ్య పంచటానికి 
   Ramesh has divided his property among his 4 sons. 
  Ramesh తన ఆస్థి ని తన నలుగురు కొడుకులకు పంచి ఇచ్చాడు . 

3. ఒక సమూహం గురించి చెప్పేటప్పుడు (a group of people or things)
  The decision has caused lot of anger among employees. 
  ఆ నిర్ణయం employees లో కోపానికి కారణమైంది 

4.  కొంత మంది లో ఒకరు లేదా కొన్నింటిలో ఒకటి లేదా ఒక గ్రూప్ కి చెందినవారు  అని చెప్పేటప్పుడు ,
  He is among the 10 victims of the accident . 
 ఇతను ఆ పది మంది ప్రమాద బాధితులలో ఒకరు / ఆ పదిమంది బాధితులలో వాడు.