Difference b/w Little, A little, The little Vs few, A few, The few
Little, A little, The little అనేవి Adjectives of Quantity .
వీటిని Uncountable subjects కి వాడుతాము. ఒక్కో దాని meaning మనం ఇప్పుడు తెలుసుకుందాం .
Little : దీని అర్ధం 'అంతగా లేదు' లేదా 'అసలు లేదు' (not much /hardly ) అనే negative meaning తెలుపుతుంది . అంటే ఒక వేళా ఉన్నఅవసరానికి తగినంత లేదు అని చెప్పటానికి వాడుతారు .
Example : I have little knowledge in history.
నాకు హిస్టరీ లో అంతగా knowledge లేదు (అసలు లేదు)
A little : దీని అర్థం 'ఎంతో కొంత' లేదా 'కొంత 'అని అర్థం. ఇది positive meaning నే తెలుపుతుంది.
Example : I have a little knowledge in history
దీని అర్థం. నాకు history లో ఎంతో కొంత knowledge ఉంది .
The little : దీని అర్థం 'ఉన్న ఆ కాస్త'. ఈ Example చూస్తే మీకు అర్థం అవుతుంది .
Example : The little knowledge of history that he has, has been gained from reading books.
అతను సంపాదించినా ఆ కాస్త knowledge, పుస్తకాలు చదవటం వాళ్ళ సంపాదించింది.
ఇంకొక example ద్వారా మీకు ఇది సులభంగా అర్థం అవుతుంది.
Ravi : Ram , Do you have money with you?
Ram , నీ దగ్గర డబ్బులు ఉన్నాయా ?
Ram : Yes. I have a little money
(అవును , నా దగ్గర కొంత డబ్బు ఉంది .
Ravi: I want to buy a cigarette. but I have little money.
నేను cigarette కొనాలని అనుకుంటున్నాను. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు .
Ram : The little money i have, is for my dinner.
నా దగ్గర ఉన్న ఆ కాస్త డబ్బు , రాత్రి భోజనం కోసం పెట్టుకున్నాను.
Note : Money అనేది uncountable noun. డబ్బు లేదా ధనాన్ని సంఖ్య గ చెప్పలేము కదా. అంటే, ఒక డబ్బు, రెండు డబ్బులు అని చెప్పలేం కదా. కానీ notes and coins మాత్రం కౌంటబుల్ nouns . తేడాను గమనించగలరు. .
Few , A few , the few
Few , A few , the few ల అర్థాలు కూడా పైన చెప్పిన విధంగానే ఉంటాయి కానీ. దీనిని countable nouns వాడతారు.
Example :
A few people attended the party. : Party కి కొంత మంది మాత్రమే హాజరు అయ్యారు
Few males are there in the party. : అందులో మగవారు అంతగా లేరు (అసలు లేరు).
The few males are servants : ఉన్న ఆ కాస్త మగవారైనా అక్కడ serve చేసే వారే .
0 Comments