Adverb | English grammar explanation in Telugu | Parts of speech 

ఇంతకముందు నేర్చుకున్న Adjective, subject ని modify చేస్తుంది. అంటే Subject ని వివరిస్తుంది. కానీ , Adverb (క్రియ విశేషణం ). Verb ని, Adjective ని, ఇంకా కొన్ని సార్లు ఇతర Adverbs గురించి కూడా వివరిస్తుంది . ఇది ఒక verb, Adjective లేదా  Adverb లు, ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఏ పద్దతిలో,  అనే వాటి గురించి వివరిస్తుంది 

గుర్తుంచుకోవాల్సిన విషయాలు  :   (Important points to remember )

* చాలా వరకు Adverbs పదం చివరలో  'ly' తో end అవుతాయి. 
* ఇలా ly తోend అయ్యే ప్రతి పదం Adverb కాదు 
* అన్ని adverbs ly తో end అవ్వవు . 


Examples  : 

1. Ramu works hard .( Ramu కష్టపడి పనిచేస్తాడు . )
2. He drives extremely fast. ( అతను చాల వేగంగా నడుపుతాడు )

Types of adverbs  

        1. Adverb of time/frequency  : (when / How much time )

 ఈ Adverb ఒక action జరుగు 'సమయాన్ని' లేదా 'ఎంత సేపు జరుగుతుంది' అనే కాల పరిమితి లేదా 'ఎంత తరచుగా' ని  తెలుపుతుంది.

Always, never, often, eventually, now, frequently, occasionally, once, forever, seldom, before, Sunday, Monday, 10 AM, 12 PM, etc. are common adverbs of time/frequency. 

Example  :  

1. I saw that movie last year. (సమయాన్ని తెలుపుతుంది )
     నేను గత సంవత్సరం ఆ సినిమా చూశాను.
2. I'm going to clean my room tomorrow. (సమయాన్ని తెలుపుతుంది )
   నేను రేపు నా గదిని శుభ్రం చేయబోతున్నాను.
3. My mother lived in France for a year. (  ఎంత సేపు అనే కాల పరిమితి ని తెలియజేస్తుంది )
    నా తల్లి ఫ్రాన్స్‌లో ఒక సంవత్సరం నివసించింది.
4. I am going on vacation for a week ఎంత సేపు అనే 
కాల పరిమితి ని తెలియజేస్తుంది )
     నేను ఒక వారం సెలవులకు వెళుతున్నాను 
5. I often eat vegetarian food. ( ఎంత తరచుగా అనే విషయాన్ని తెలియజేస్తుంది )
    నేను తరచుగా శాఖాహారం తింటాను.
6. He rarely lies  ( ఎంత తరచుగా అనే విషయాన్ని తెలియజేస్తుంది )
    అతను చాలా అరుదుగా అబద్ధం చెబుతాడు
7. He never drinks milk.  ( ఎంత తరచుగా అనే విషయాన్ని తెలియజేస్తుంది )
    అతను ఎప్పుడూ పాలు తాగడు.
8. I have not finished my work yet . 
9. I am still waiting for you. 
   

Note  : Adverb ని sentence లో రెండు place లలో పెట్టొచ్చు . 

Example  : Generally, I don't like spicy foods. or 
                     I generally don't like spicy foods.

            2. Adverb of place/Direction :  (Where / which directon ?)

ఈ adverb ఒక action యొక్క చోటును(Place )/ కదలక జరుగు వైపు(Direction ) ను గురించి  తెలియజేస్తుంది. ఇది సాధారణగా,verb తరువాత వస్తుంది. ఇది కేవలం verb గురించి మాత్రమే మాట్లాడుతుంది. Adjective లేదా ఇతర adverb ల గురించి తెలియజేయదు.   

కొన్ని Adverb of places  : Here ,there, down, in , Back, nearby , outside, etc. 
Adverbs  of direction :Backward , Upward , Downward , Forward 

Examples with sentence : 

1.Please come here
2. I parked my car outside . 
3. I am going to office. 
4. Please go forward 
5. He is running towards the bus 

Note : ఈ రకం adverbs లో కొన్ని prepositions కూడా adverbs గా ఉపయోగిస్తారు .  
Example : He fell down. 
                 Please come in .

Difference  between adverb of place  Vs prepositions 

1. He went inside  ( ఇక్కడ inside అనేది adverb. ఎందుకంటే, ఇక్కడ preposition అనేది verb తరువాత వచ్చింది  )
    He went inside the house (కానీ ఇక్కడ inside అనేది preposition అవుతుంది . ఎందుకంటే , అది verb తరువాత వచ్చినా కానీ దాని తరువాత Noun వచ్చింది కాబట్టి అది preposition అవుతుంది . 


            3. Adverb of manner : ( How ?)

ఈ adverb ఒక action ఎలా జరిగింది లేదా అది జరిగే రీతి /పద్దతి ని చెప్పటానికి ఉపయోగిస్తారు. అవి సాధారణంగా Main verb  తర్వాత లేదా Object తరువాత ఉంచబడతాయి.

Example :Well , Beautifully, equally, thankfully, carefully, handily, quickly, coldly, hotly, resentfully, earnestly, nicely, tirelessly, etc.. 

Examples with sentence : 

1. Our country 's economy rate is increasing gradually 
మన దేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు నెమ్మదిగా పెరుగుతుంది. 
ఇక్కడ Gradually అనే adverb వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది అనే దానిని చెబుతుంది . మరియు ఇది increasing అనే verb కి తరువాత వచ్చింది  
2. He speaks loudly . అతను గట్టిగ మాట్లాడుతాడు. 
3. He plays the flute beautifully. (ఇక్కడ beautifully అనే adverb flute అనే object తరువాత వచ్చింది )

Note : 1.  ఒక Verb మరియు దాని Object మధ్య Adverb of manner ఉంచబడదు.
 Example : 

Incorrect  :   He is driving very fast the car 
Correct : He is driving the car very fast. 

 ( కొందరు fast అనే పదాన్ని adverb గా రాయాలంటే , fastly అని రాస్తారు . కానీ అది తప్పు. fast కి adverb form కూడా 'fast' అనే రాయాలి)

Note  2 .  ఒకవేళ, verb యొక్క object కి ముందు ఒక preposition ఉంటే, మీరు preposition ముందు లేదా object  తర్వాత గాని Adverb of manner పెట్టవచ్చు .
  • The child ran happily towards his mother.
  • The child ran towards his mother happily
 ఆ పిల్లవాడు తన అమ్మ వైపు సంతోషంగా  వస్తున్నాడు . 

4. Adverbs of degree or quantity: ( How much / to what extent ? )

ఈ Adverbs , ఒక clause లో,  Verb లేదా adjective లేదా ఇతర adverb ల గురించి, అవి ఎంత మేరకు లేదా ఎంత పరిమాణం అనే దాని గురించి తెలుపుతుంది. ( How much / to what extent )

Examples : Completely, nearly, entirely, less, mildly, most, thoroughly, somewhat, excessively, much, etc. 

Examples with sentence : 


1. I completely forgot about your birthday .
2. I read the book thoroughly.
3. You are running fast enough.


పైన చెప్పిన adverbs లోని రకాలు, When, Where, How much, how అనే వాటి గురించి వివరించింది. ఇవే కాకుండా, ఇంకొన్ని Types of adverbs ఉన్నాయి. వాటిని Adverbs of Evaluation అని అంటారు. వీటి గురించి తెలుసుకుందాం. 


5. Adverbs of Evaluation : 

   ఇవి, మాట్లాడేవారి comment లేదా opinion తెలపడానికి వాడతారు. వాటి గురించి తెలుసుకుందాం. 

a ) Adverbs of certainty : 


ఈ adverb, ఒక verb, ఎంత మేర కచ్చితమైన లేదా ఎంత మేర స్పష్టమైనది అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇది సాధారణంగా Main verb ముందు వస్తుంది . 
Examples : Definitely, surely, probably, certainly, undoubtedly, etc. 

Examples with sentence : 

1. Undoubtedly, i will be there tomorrow.
 
సందేహం లేకుండా, నేను రేపు కచ్చితంగా ఇక్కడ ఉంటాను. 
2. surely , he will miss the bus . 
ఖచ్చితంగా అతను bus miss అవుతాడు. 

b ) Adverbs of Attitude : ఇది, చెప్పే వారి యొక్క ధోరణి, ఆ విషయం పై ఎలా ఉంది అని తెలుపుతుంది. 

astonishingly, frankly, fortunately, honestly, hopefully, interestingly, luckily, sadly, seriously, surprisingly, unbelievably, etc.

Examples  : Hopefully, he will reach the top

c) Adverbs of Judgement : ఇది, చెప్పే వారి  ఒక విషయాన్నీ నిర్ణయాత్మకంగా చెప్పటాన్ని వివరిస్తుంది.


bravely, carelessly, fairly, foolishly, generously, kindly, rightly, spitefully, stupidly, unfairly, wisely, wrongly, etc.

Examples:

She kindly lent me her bicycle.

The jacket is very generously cut.

I carelessly broke the glass.

d) Conjunctive Adverbs

Conjunctive అంటే connectors. ఇవి రెండు clause లు లేదా రెండు phrase లను కలిపి ఒక sentence గ కలుపుతుంది . 
accordingly, besides, comparatively, conversely, equally, further, hence, in comparison, incidentally, namely, next, now, rather, undoubtedly, additionally, anyway, certainly, elsewhere, finally, in addition, in contrast, indeed, moreover, nonetheless, similarly, subsequently, thereafter, yet, also, meanwhile, consequently, nevertheless, finally, next, furthermore, otherwise, however, still, indeed, then, instead, therefore, likewise, thus, etc)

Examples  

1. They bought a new car; however it was still too small for their family.

వాళ్ళు కొత్త car కొన్నారు. అయినా వాళ్ళ ఫామిలీ కి అది చాల చిన్నది . 
2. You need to put more effort into your work; otherwise, you won’t get a good rank . 
నువ్వు ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయాలి.  లేకపోతే,నీకు మంచి rank రాదు .