By

1. By + Place : ప్రక్కన (next to )

   The shop is by the bus stop. 
   ఆ షాప్ బస్టాండ్ పక్కన ఉన్నది. 
2. ప్రయాణం జరిగిన వాహనం, మార్గం ని చెప్పడానికి, 

   They came here by car. 
    వాళ్ళు ఇక్కడికి కార్ లో వచ్చారు. 
  They arrived by ship.
   They arrived by air . (గాలి మార్గం గుండా )

    
3. సంభాషణ జరిగిన లేదా సమాచారం అందించిన విధానం ని   తెలియజేయడానికి. 
         by phone
        by email
        by post
        by fax
Ex : I received the appointment letter by email.
నాకు appointment letter email ద్వారా వచ్చింది.
4. payment జరిగిన విధానం (to describe a method of payment). 
   డబ్బులు చెల్లించిన లేదా లావాదేవీ జరిగిన విధానం తెలియజేయడానికి. 
   I paid the bill by credit card . 
  నేను credit card ద్వారా డబ్బులు చెల్లించాను.
5. ఒక పని ఎవరి చేత చేయబడింది అని చెప్పడానికి (Passive Voice )
  The car was driven by me. (నా  చేత ఆ కార్ నడపబడింది )
   
6. ఒక పని ఫలితం దేని వాళ్ళ అని చెప్పడానికి 
    You can turn on the television by pressing that button. 
     నీవు ఈ బటన్ నొక్కడం ద్వారా tv ఆన్ అవుతుంది .  
     I did it by mistake. 
   నేను పొరపాటు న ఇది చేశాను. 
     They met by chance. 
      వారు అనుకోకుండా కలిశారు. 
     
7. By + time 
    ఆ సమయం లోపు, లేదా ఆ సమయానికిఅని చెప్పడానికి 
   They close the hotel by 9.00 pm everyday. 
   వారు ఆ hotel ని రోజు రాత్రి 9 గంటల వరకు close చేస్తారు. 
    By this time next week we'll be in New York.
    వచ్చే వరం ఈ సమయానికల్లా మేము న్యూయార్క్ లో ఉంటాము. 
    I'll have it done by tomorrow. 
    రేపటికి నేను ఈ పని పూర్తి చేస్తాను. 
8. ఎంత మేర  ఎక్కువ లేదా తక్కువ ఉంది అని చెప్పడానికి, (degree, extent or amount of something). 
    
     He's taller than his sister by three inches. 
    అతను తన సిస్టర్ కంటే 3 ఇంచులు పొడుగు ఉన్నాడు. 
9. ఒక ప్రత్యేకమైన సమయం లో లేదా ఒకటి జరుగుతున్న సమయం లో జరిగే పనిని చెప్పడానికి 
   I  had complete this work by weekend holiday. 
  నేను ఈ పనిని వారాంతపు సెలవులో చేయాల్సి వచ్చింది. 
10. ఒక దాని వాళ్ళ ఇంకోటి చెప్పబడుతున్నప్పుడు
    I could tell by the look on her face that something terrible had happened. 
  నేను అతనిముఖం చూసి, ఏదో భయంకరమైనది జరిగిందని నేను చెప్పగలిగాను . 
By my watch it is two o'clock. 
నా గడియారం ప్రకారం సమయం 2 గంటలు. 
11. ఒకరిని లేదా ఒక దానిని దాటడం అని చెప్పేటప్పుడు
   He walked by me without speaking. 
  నన్ను దాటేసి ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. 
12. ఒక పని లేదా తాకడం శరీరం లో ఒక భాగం ద్వారా లేదా ఒక వస్తువు ద్వారా అని చెప్పడానికి 
    I cleaned it by my hand 
    నేను దానిని చేతితో శుభ్రం చేశాను. 
13. ఈరేటును లేదా ఎలా గడుస్తుంది లేదా ఎలా  జరుగుతుంది అని చెప్పడానికి 
            Step-by-step =  దశలవారీగా 
        Day -by -day = రోజు రోజుకి 
        Inch-by-inch = అంగుల అంగుళం (నెమ్మదిగా )
        two-by -two = ఇద్దరిద్దరు/ రెండ్రెండు ( ఒక group గ ) 
14.  కొనటానికి/అమ్మటానికి లేదా జీతం  చెల్లించే పద్ధతికి 
        Bananas are sold by dozen 
       అరటి పళ్ళను డజన్ లెక్కలో అమ్ముతారు .  
       They are paid by the week. 
       వారికి   వారానికి  ఇంత అని చెల్లిస్తారు. 
15.  ఒకరి వృత్తి, జన్మ స్థలం (దేశం ) లను  చెప్పేటప్పుడు 
      
     He's Indian  by birth. 
     అతను పుట్టుకతో భారతీయుడు.
     They're both doctors by profession.
16. ఎవరి సహాయం లేకుండా సొంతగా చేసుకోవడం అని చెప్పేటప్పుడు 
     I learnt English by myself. 
    నేను ఇంగ్లీష్ ని ఎవరి సహాయం లేకుండా సొంతగా నేర్చుకున్న.