Down : (క్రిందకు )
1. ఎత్తు నుండి లేదా ఎగువ నుండి దిగువకు అని చెప్పడానికి,
(Higher point to lower point)
Example : Tears ran down her face.
ఆమె ముఖం మీద నుండి కన్నీళ్ళు కారుతున్నాయి.
2. అదే దారిలో ముందుకు అని చెప్పడానికి
Example : Go down the road till you reach the traffic light
ఈ రోడ్డు లో అలాగే ముందుకు సిగ్నల్స్ వచ్చేవరకు వెల్లు .
He lives just down the street.
అతను ఈ వీధిలోనే నివసిస్తాడు (కొంచం ముందు, ఈ వీధిలో ఎదో ఒక దగ్గర)
3. కొన్నిసంవత్సరాలనుండి , కొన్ని తరాలనుండి లేదా చాల కాలంనుండి అని చెప్పడానికి
Example : But down the years the gap between the two families has narrowed greatly.
కానీ కొన్ని సంవత్సరాలనుండి ఈ రెండు కుటుంబాల మధ్య అంతరం చాలా తగ్గింది.

0 Comments