Between
1. రెండింటి మధ్య లేదా సమయం మధ్య అని చెప్పేటప్పుడు
There is a lake between the two towns.
ఆ రెండు పట్టణాల మధ్య ఒక సరస్సు ఉంది.
He will come between 10:00 am and 11:00 am.
అతను పొద్దున 10 నుండి 11 గంటల మధ్య సమయం లో వస్తాడు .
2. రెండింటి మధ్య సంబంధాన్ని తెలపటానికి
There is transportation service between the two cities.
ఆ రెండు నగరాల ఆమధ్య రాకపోకలు ఉన్నాయి.
There are many transactions between the two companies.
ఆ రెండు కంపెనీ ల మధ్య చాల లావాదేవీలు ఉన్నాయి.
కొన్ని సందర్భాలలో రెండు కన్నా ఎక్కువ వాటి మధ్య కూడా Between ని వాడుతాము. కానీ వాటి మధ్య పరస్పర సంబంధం (Reciprocal Relationship ) ఉన్నప్పుడే వాడుతాము.
A treaty has been signed between the four countries.
ఆ నాలుగు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
(అంటే దీనిఅర్థం ఆ నాలుగు దేశాలలో కూడా ఒక దేశం తో ఒకటి పరస్పర ఒప్పందం అని అర్థం వస్తుంది )
3. రెండింటిని పోల్చడానికి, రెండింటిలో ఒకటి ఎంచుకోటానికి మరియు రెండింటికి పంచడానికి (Comparing , Sharing )
The main difference between Ramu and Gopi is the intelligence.
రాము మరియు గోపి మధ్య ఉన్న ప్రధాన తేడా వారి తెలివి .
The property is shared between the two brothers.
ఆ ఆస్థి ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య పంచబడింది.
You have to select between these two.
నీవు ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోవాలి.

0 Comments