Beside  (ప్రక్కన )

1. ఒకదాని లేదా ఒక వ్యక్తి పక్కన అని చెప్పడానికి (At the side of ,Next to) 
    Please come and sit beside me 
    మీరు వచ్చి నా పక్కన కూర్చోండి . 
    My house is beside Ram  temple 
     మా ఇల్లు రాముడు గుడి పక్కన 
2. పోల్చడానికి (For comparing  )
    Beside your bike my bike looks old 
   నీ బైక్ తో పోల్చితే నా బైక్ పాతదాని లాగ కన్పిస్తుంది . (పక్కన పెట్టి పోలిస్తే అని చెప్పినట్టు )
3. అదికాకుండా(Apart from), లేదా ప్రస్తుతం మాట్లాడుకునే విషయానికి సంబంధం లేదు(Not connected with ) అని చెప్పడానికి ( సాధారణంగా దీనిని idiom/phrase  లాగా ఉపయోగిస్తారు )
Beside the point/Beside the question =irrelevant ,

మాములుగా మనం మాట్లాడుకునేటప్పుడు , ఆ విష్యం తో దీనికి ఏంటి సంబంధం, దాన్ని విషయాన్నీ పక్కన పెడితే, కానీ అది అసలు విషయమే కాదు, అనే సందర్భాలలో దీనిని వాడుతాం. 

It is beside the point that you have much money , the point is how wisely you spend it . 
నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నది అనేది విషయమా కాదు. నువ్వు ఎంత తెలివిగా వాటిని ఖర్చు చేస్తావు అనేది విషయం . 

Those issues are beside the point. 
ఆ సమస్యలు అసలు విషయమే కాదు ( అసలు దానితో సమస్యే లేదు అనే అర్థం )
 Of course He does not like it . But that is beside the point . 
అవును అతడికి అది నచ్చదు. కానీ దానితో మనకు అనవసరం (అతని  పనిలేదు అని చెప్పడం ) 
 I do love the house . but that is beside the point because the owner of the house is not ready to sell it . 

నాకు ఆ ఇల్లు నచ్చింది. కానీ అది విషయం కాదు (నాకు నచ్చిన ఏముంది ). ఎందుకంటే ఆ ఇంటి యజమాని దానిని అమ్మడానికి సిద్ధంగా లేడు .