Across 


ఈ preposition అర్థం, ఒక వైపు నుండి మరో వైపు, లేదా అవతలి వైపు అని అర్థం.

1. ఒక వైపు నిండి మరో వైపు

The dog ran across the road

ఆ కుక్క రోడ్డుకు అడ్డంగా పరిగెత్తింది .

We drove across the desert.

మేము ఎడారి గుండా(మీదుగా ) ప్రయాణించాము .

He is swimming across the canel.

అతను canel కి ఇటువైపు నుండి అటువైపుకు ఈదుకుంటూ వెళ్తున్నాడు.

they are building a bridge across the river

వారు నదికి అడ్డంగా (మీదినుండి ) బ్రిడ్జి కడుతున్నారు .

2. అవతలి వైపు (on the opposie side )

There is a petrol pump just across the road.

అక్కడ రోడ్డు కు అవతలి వైపు ఒక పెట్రోల్ పంప్ ఉంది .

3. ఒక ఏరియా లో లేదాఒక దేశం లో చాల చోట్ల అని చెప్పేటపుడూ

The company has many branches across the country.

ఆ కంపెనీ కి దేశం లో చాల చోట్ల శాఖలు ఉన్నాయి .

4. శరీరం లోని ఒక భాగం కి కలిగే నొప్పి లేదా ఇతర ప్రభావం గురించి చెప్పడానికి

I am feeling a sharp pain across the chest .

నాకు చాటి భాగం లో నొప్పిగా అనిపిస్తుంది .

5. అంతట లేదా ఒక ప్రాంతం లో వ్యాపిస్తుంది అని చెప్పటానికి ,

The virus is quickly spreading across the country

ఆ విర్స్ తొందరగా దేశం అంతటా వ్యాపిస్తుంది.

A warm smile spread across her face.

ఒక చిన్ని చిరునవ్వు తన ముఖం మీద వచ్చింది .