Above - మీద ,పైనా 


1. ఈ Preposition ని  కన్నా ఎక్కువ అని చెప్పేటప్పుడు వాడుతాము (higher than’, ‘greater than’ or ‘more than’.)

The plane is flying above the clouds. (Higher than )
ఆ విమానము మేఘాల కన్నా మీద ఎగురుతుంది. 

His age is above thirty (more than)
అతని వయస్సు 30 పైన ఉన్నది. 

She is above average in  the intelligence. (Greater than )
ఆమె మేధస్సు సగటు కన్నా ఎక్కువ. 
The river is flowing above the danger level 
ఆ నది ప్రమాదకర స్థాయి కంటే ఎక్కువగా ప్రవహిస్తుంది 

2. official writings లో లేదా letters లో లేదా articles లో, ' పైన చెప్పిన విదంగా ' లేదా 'పైన సూచించినట్టుగా ' అని చెప్పే సందర్భాలలో above ని వాడతాము . 
Examples :

please refer figure no 1 above . 
పైన చూపించిన బొమ్మ ను చుడండి . 
 

3. ఒక విషయాన్ని మనం అంత తొందరగా అర్థం చేసుకోలేము అని చెప్పేటప్పుడు
 ( ఇది informal గ మాట్లాడుకోవడానికి  )
Einstein’s theories have always been above me. (= I have always had difficulty understanding Einstein’s theories.)

Einstein’s సిద్ధాంతాలు అర్థంచేసుకోవటం నాకు కష్టం ( నా intelligence స్థాయి కంటే అది ఎక్కువ అని చెప్పినట్టు)

above ని adverb గ కూడా వాడుతారు . 

As mentioned above , all the employees should follow the instructions . 
పైన సూచించినట్లుగ అందరు ఉద్యోగులు సూచనలు తప్పకుండ ఆచరించాలి . 

For details please see the table No 1, demonstrated above 
వివరాలు కోసం పైన చూపబడిన Table NO 1 ని చుడండి .