Relative pronoun:

 వాక్యంలోని pronoun దాని ముందున్న subject(Antecedent, usually  noun) తో   ఉన్న సంబంధాన్ని తెలియజేస్తే అవి Relative pronouns . 
 Example:The cyclist who won the race trained hard.
ఇక్కడ cyclist అనేది subject, who అనేది relative pronoun అవుతుంది.
ఇక్కడ రేసులో గెలిచిన సైక్లిస్ట్ కఠినంగా శిక్షణ పొందాడు అని అర్ధం.
 Relative pronouns ని "Conjunction" గ కూడా వాడతారు .  
Conjunction అంటే రెండు clause  లేదా sentences ని కలిపేది. 



List of Relative pronouns:




who - ఎవరు , ఎవరైతే (relative  pronoun  లో)
Example : I am the one who did this.

ఈ పని చేసిన వ్యక్తిని నేనే .

whom- ఎవరినైతే
ఇది who  కి objective  form .
Example  : He is that one whom i asked about this city.

నేను   ఎవరినైతే  ఈ city గురించి అడిగానో అది ఇతనే . or నేను ఈ సిటీ గురించి అడిగింది ఇత్తడినే .

 whose - ఎవరి. ఎవరిది .
ఇది who యొక్క possessive form
Example : The man whose son won the tournament is a tennis couch.
ఎవరి కొడుకైతే ఆ tourment గెలిచాడో అతను ఒక tennis couch . or  ఆ టోర్నమెంట్ గెలిచినా వాడి నాన్న ఒక tennis  couch .

(who, whom, whose సాధారణంగా మనుషులకే వాడతారు . కొని సందర్భాలలో జంతువులకు పేరు తో మాట్లాడినప్పుడు  లేదా జంతువుని కూడా మనిషి గా  పరిగణిస్తారో  అప్పుడు కూడా వీటిని జంతువులకు pronoun గా  వాడవచ్చు . )


which- ఏది
దీనిని సాధారణంగా వస్తువలులకు గాని లేదా జంతువులకు గాని వాడతారు.
I bought a new car, which is red colour .


 That -  అది
దీనిని వస్తువులకు , జంతువులకు మరియు  మనుష్యులకు వాడుతారు .
Example  : The car i that bought runs on gas

whoever - ఎవరైతే
 You can invite whoever you want. Whoever comes will be welcome

whomever- ఎవరినైతే
We will hire whomever you recommend.
మీరు ఎవరినైతే recommend చేస్తారో , వారినే మేము job లోకి తీసుకుంటాము.

కొన్ని సందర్భాల్లో  when, where లను Relative pronouns గా పరిగణిస్తారు.
when - ఎప్పుడు
Example  : 2008 was the year when terrorists attacked taj hotel in mumbai.

Where : ఎక్కడ ,
Example : I want to return to my hometown where i have my own house.


Relative pronoun గా that  ని మరియు which ని ఎప్పుడు ఉపయోగించాలో తెలుసు కోవటం  కొంచెం tricky . కొంచెం confusing గా  ఉంటుంది . అలాగే, Antecedent  కి relative pronoun  కి మధ్య కామా "," ఎప్పుడు పెట్టాలో తెలుసుకోవటం కూడా confusing గా ఉంటుంది.
దీనిని మీరు పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే  , Restrictive clause and Non-restrictive clauses గురించి తెలియాలి. తెలుసుకోవటనికి దాని మీద క్లిక్ చేయండి .


Common mistake : Subject లో  "I" వచ్చినప్పుడు , relative pronoun తర్వాత verb /helping  verb 'I ' కి సంబంధించినదే రాయాలి. కానీ మనము అలవాటులో "is " పెడతాము . 
Example : 
Incorrect : I, who is your land lord, shall ask you to keep my house clean.

correct : I, who am your land lord, shall ask you to keep my house clean.

Rule 1 : కొన్ని సందర్బాలలో ఒక relative pronoun, అటు subjective గాను మరియు objective గాను ఉపయోగించబడుతుంది . అలాంటప్పుడు ఆ రెండింటికి ఒకే relative pronoun తో సూచించకూడదు . subjective ని మరియు ఆబ్జెక్టివ్ ని వేరు వేరు గ సూచించాలి . 
Example : 
Incorrect : He is my friend whom i introduced and is a post graduate.
Correct :  He is my friend whom i introduced and who is a post graduate.

దీని అర్థం " నేను ఎవరినైతే introduce చేసానో , అతను నా friend , మరియు అతను post  graduate. "



Rule  2: రెండు కంటే ఎక్కువ subjects మొదటి clause  లో వచ్చినప్పుడు , Relative  pronoun  ని వీలైనంత దాని సంబంధిత సబ్జెక్టు కి దగ్గరగా రాయాలి. అంటే, ఆ subject తర్వాత వెంటనే  Relative pronoun రావాలి.
లేదంటే ఆ sentence అర్ధమే మారిపోతుంది.
Example :
Incorrect : My company is located at Banjarahills, which have 4000 employees.

దీని అర్ధం, మా company banjarahills  లో ఉంది . బంజారాహిల్స్ లో 4000 ఎంప్లాయిస్ ఉన్నారు అని అర్ధం వస్తుంది .

కానీ మన చెప్పాలనుకునేది " మా company banjarahills  లో ఉంది . మా company లో 4000 ఎంప్లాయిస్ ఉన్నారు. "
so ,
correct sentence : My company, which have 4000 employees,  is located at Banjarahills.

అలాగే
example  2: India became dependent on his batting, who scored runs with a passion.

ఇందులో కూడా batting అనేది సబ్జెక్టు గా, అంటే పరుగులు చేసేది batting అనే అర్ధం వస్తుంది . దీనిని avoid చేయడానికి మనం ఇలా రాయొచ్చు ,
               India became dependent on the batting of  him , who scored runs with a passion.