Below


1. ఈ Preposition ని 'ఒక దాని కింద' అని చెప్పేటప్పుడు వాడుతాము. (Lower than, Under ) . దీని పై దానితో కిందిది  అనుకోని లేదా కలిసి లేనప్పుడు వాడాలి . 

Please start writing below this line. 

ఈ గీత కింద రాయడం ప్రారంభించండి . 

Note : పైన ఉన్న వస్తువు తో కింది వస్తువు తాకివున్నప్పుడు లేదా కవర్ చేసినప్పుడు లేదా దాచినప్పుడు మనము below ని వాడకూడదు. అప్పుడు under ని వాడాలి . 

I kept my book under the pillow 

నేను దిండు కింద పుస్తకం పెట్టాను . ( ఇక్కడ పుస్తకం దిండుకి తాకి ఉంది లేదా కవర్ చేస్తూ దాచబడి ఉంది . కాబట్టి ఇక్కడ మనం under  నివాడాము )

2. Numbers, Amounts, statistics(గణాంకాలు), levels and age  కి 'below ' ని వాడాలి 

Growth rate has fallen below 5% for the first time in six years.
ఆరు సంవత్సరాలలో మొదటిసారిగా వృద్ధి రేటు 5% కన్నా తక్కువకు పడిపోయింది.
Two -thirds of people in India live in below the poverty line
భారత దేశం లో 2/3 వంతు జనాభా దారిద్య రేఖ కు దిగువన జీవిస్తున్నారు . 

3. Rank, Cadre,Grade లకి below వాడాలి. 
Gazetted officers below the rank of DIGP may either be IPS or SPS officers
   డిఐజిపి ర్యాంకు కంటే తక్కువ ఉన్న గెజిటెడ్ అధికారులు ఐపిఎస్ లేదా      ఎస్పిఎస్ అధికారులు కావచ్చు.