Types of Verbs:
types of verbs explanation in telugu english grammar


సాధారణంగా Verbs ని 6 రకాలుగా చెప్తుంటారు. అవి ,
1. Action verb.
2. Auxiliary or helping verb 
3. Linking verb.
4. Transitive verb
5. Intransitive verb
6. Finite verb
7. Non-finite verb
8. Model verb
9. Stative verb


Action Verb :

పేరు లో ఉన్నట్టుగా ఇది subject  యొక్క actions ని తెలియజేస్తుంది. ఈ action Physical action లేదా mental action అయి ఉండవచ్చు. 
Physical action అంటే, Run, jump, drink, kick, etc...
Mental action అంటే, Think, guess, like, want etc...

Example:
1. I played cricket.
   
2. He is thinking about future.

Auxiliary verb

  Auxiliary verb ని helping verb అని కూడా అంటారు . Auxiliary verb ఒక sentence  లోని   main verb కి helping verb ( సహాయకంగా )గా  ఉంటుంది.  Auxiliary verb మరియు main verb లు, ఆ  sentence  ఏ  tenses, form(mood ), voices(active  voice  or  passive voice ) లో ఉన్నాయని, అర్ధవంతంగా  తెలియజేయడానికి  ఉపయోగపడును. ఒక sentence  లో  auxiliary verb main verb కి ముందు ఉంటుంది.

Auxiliary verbs  ని మూడు రూపాలు గా చెప్పవచ్చు .

Auxiliary verb forms:
 To Do: does, do, did, will do.
 To Be: am, is, are, was, were, being, been, will be.
 To Have: has, have, had, having, will.

Examples:
1. she is waiting in the hall. 
     దీని అర్ధం  ఆమె హాలులో వేచి ఉంది. ఇక్కడ  'is' auxiliary verb. ఇక్కడ  is  అనేది sentence   ఏ  tense లో  ఉందో  తెలియజేయడానికి ఉపయోగపడుతుంది .

2. Do you know?
    దీని అర్ధం నీకు  తెలుసా అని.  ఇక్కడ 'do'  auxiliary verb. ఇక్కడ do  అనేది  sentence  ఏ mood లో ఉందో తెలియజేయడానికి ఉపయోగపడుతుంది.

3. The bread was eaten by the cat.
     దీని  అర్ధం  బ్రేడ్ ని పిల్లి తిన్నది అని.  ఇక్కడ was అనేది  ఈ sentence  ఏ voice లో ఉందో తెలియజేయడానికి ఉపయోగపడుతుంది.


Note:  ఒక  sentence (వాక్యం) లో  helping verb లేనపుడు, do మరియు have లు main verb గా ఉన్నపుడు,  ఆ sentence ని  question form లో లేదా  negative form లో రాయడానికి  Auxiliary verb   "do"  ని  ఉపయోగించాలి.
Examples :
    sentence లో  helping verb లేనపుడు,
1. I play  cricket.
Q: Do i play cricket. (question form  )
N: Don't  play cricket. ( negative  form  )

    Sentence  లో do main verb గా ఉన్నపుడు,
2. I do my homework.
Q: Do i do my homework. (question form)
N: I don't do my homework. ( negative form)

   Sentence లో have main verb గా ఉన్నపుడు,
3.  I  have  mobile.
Q: Do i have mobile. ( question form)
N: I don't have mobile. ( negative  form)       

Linking verb

     Linking verb అనేది  ఒక sentence లో subject తో,  subject కి సంబందించిన విషయాన్నితెలియజేస్తుంది. అంటే ఈ verb ని  subject యొక్క information ని లింక్ చేయడానికి వాడతారు   దీనికి  object అవసరం లేదు. కానీ, verb తర్వాత ఒక word లేదా phrase ఉండాలి.
Ex : Biryani          tastes                        spicy.
        (subject)  (linking verb)   (subject's information)


List of Linking verbs :

Be: am, is, are, was, were, has been,  might have been, ect... 
 Became and seem
   
Appear, feel, grow,  look, prove, remain, smell, sound, taste, and true... 
(Note: కొన్ని సందర్భాలలో ఇవి action verbs గా కూడా ఉపయోగిస్తారు). 

Examples and usage of linking verbs :

1. Kiran is a shopaholic. 
    కిరణ్ ఒక దుకాణదారుడు అని అర్ధం. ఇక్కడ is అనే linking verb  కిరణ్ (subject ) ఒక దుకాణదారుడు అనే విషయాన్నీ తెలియజేయడానికి ఉపయోగపడింది.  

2. The soup taste too spicy.
    సూప్ టేస్ట్ చాలా కారంగా  ఉంది  అని అర్ధం.  ఇక్కడ taste అనే linking verb సూప్ (subject ) యొక్క రుచి కారంగా ఉంది అనే విషయాన్నీ తెలియజేయడానికి ఉపయోగించారు. 

3.  The rose flowers are red. 
    గులాబీ పూలు ఎరుపు రంగులో ఉంటాయి అని అర్ధం.  ఇక్కడ are linking verb.

Transitive verb:

 ఒక SENTENCE లో VERB కి object ఉంటేనే ఆ sentence పూర్తి meaning  తో అర్ధవంతంగా ఉంటుంది.  అలంటి verb ని TRANSITIVE VERB అంటారు. 
  EX: He stole ..........

ఈ example లో stole అనేది verb , కానీ ఈ sentence  అర్ధవంతంగా లేదు. incomplete  గా ఉంది . ఈ verb కి object కావాలి. అంటే అతను ఏమి దొంగతనం చేసాడో  తెలియాలి .

He stole my mobile .

TRANSITIVE VERB ని identitfy చేయడానికి మనం ఆ verb కి WHAT OR WHOM అని QUESTIONS వేసుకోవాలి.

అంటే ఆ VERB యొక్క పని దేని మీద  జరిగింది లేదా ఎవరి మీద జరిగింది? అనేది OBJECT లో వివరించబడితే ఆ VERB TRANSITIVE VERB అవుతుంది .
  
Examples :  
1. Ramu eats bread.

eat what?

    రాముడు bread  తింటాడు.  ఇక్కడ eats transitive verb, bread (object ) తో  Ramu  (subject ) చేసి  పనిని తెలియజేస్తుంది.

2. He kicked Ramu.

Kicked whom?

పై examples లో జరిగిందో Verb జరిగిన పని ఎవరిమీద లేదా దేని మీద జరిగిందో తెలియజేస్తుంది . కాబట్టి ఇది Transitive verb.

   

Intransitive verb:

 Intransitive verb కి object అవసరం ఉండదు . అంటే ఆ verb యొక్క చర్య దేనిమీద లేదా వ్యక్తి మీద పడదు. అందుకే దీనికి object అవసరం ఉండదు. కేవలం subject మరియు verb తో అర్థవంతమైన sentence వస్తుంది.

Example : She cried . 
ఆమె ఏడ్చింది .


ఇందులో cried అనే verb దేని మీద లేదా ఎవరిమీద  కూడా దాని చర్య చూపలేదు .  అంటే పైన చెప్పినట్టు WHAT OR WHOM? అనేది దీనికి వర్తించదు .

Example 2 :

He sat on the chair.

ఇందులో on the chair అనేది object కాదు. ఇది verb యొక్క చర్య ఎక్కడ జరిగింగి అనేది తెలియజేస్తుంది. ఇది ఒక adverb(adverb of place or spatial adverb). ఇక్కడ sat whom ? అని అనలేము . sat what ? అని అడిగితే అది మల్లి subject నే సూచిస్తుంది. అందుకే ఇక్కడ లేదు అని చెప్పవచ్చు.

Finite verb

    ఇది sentence లో subject చేసే పని ఏ tense ( కాలం ) లో ఉందో వ్యక్తపరుస్తుంది. 

Example :
1. Ramu is reading a book.
   రాము ఒక పుస్తకం చదువుతున్నాడు. ఇక్కడ is అనే finite verb,  ramu (sub) చేసే పనిని  కాలం (tense) తో పాటు తెలియజేస్తుంది.

2. Seetha cooks tomatoes.
    సీత టమోటాలు వండుతుంది. Ekkada cooks finite verb,  seetha ( sub ) చేసే పనిని కాలం (tense) తో పాటు తెలియజేస్తుంది.

Non-finite Verb:


Finite verb లో లాగా ఈ verb ఏ tense లో ఉందొ తెలియజేయదు. ఈ verbs ని noun , adjective లేదా adverb లాగా వాడతారు. ఇంకా finite verb తో కలిపి కూడా కొన్ని సార్లు వాడతారు. 
  
Non-finite Verb మూడు రకాలు :

1. Gerund :

gerund అంటే noun గా రాసిన verb అని అర్థం. అంటే verb కి చివరలో ing ని add చేస్తారు. example :running , cooking , swimming

Example : Swimming  is the best exercise.


2. Infinitive :

Infinitive అంటే ఒక  verb form, ఇది noun, adjective, or  adverb లాగావాడతారు . 
సాధారణంగా infitive verb  కి ముందు "to " ని వాడతాము . కానీ అన్ని సందర్భాలలో ఇలా రాయము. 
Example : to make, to cook, to find.

Ex: I decided not to go office this week.

         I tried to cook biryani

3. Participles


Participle అనేది ఒక verb రూపం, ఇది adjective గా పనిచేస్తుంది.  
Participles రెండు  రకాలు : 

1.Present Participle ("-ing " తో ముగుస్తుంది) మరియు

Example : 
Don’t try to catch a running bus.

He has given and inspiring speech


2. Past Participle (సాధారణంగా "-ed," "-d," "-t," "-en," లేదా "-n" తో ముగుస్తుంది). 


   Exapmle : She is ironing washed clothes.


Modal verb

     Modal verb అనేది సామర్ధ్యం, అవకాశం, అనుమతి మరియు బాధ్యతల  లాంటి ఆలోచనలను తెలియజేయడానికి ఉపయోగించే ఒక రకమైన సహాయక క్రియ. వీటిని model auxiliary verbs అని కూడా అంటారు. 
  
Modal verbs : can, could,
 May, might, must, ought of, shall, should,  will and would.

Examples :
1. I can walk three kilometers  an hour.
    నేను గంటకు మూడు కిలోమీటర్లు నడవగలను. ఈ వాక్యాంలో సామర్థ్యం(ability) గురించి తెలిజేయబడింది. ఇక్కడ can model verb.

2.  Could  you please tell me that number.
      దయచేసి మీరు ఆ నంబర్ నాకు చెప్పగలరా. ఈ వాక్యంలో  అనుమతి తీసుకోవడానికి ( request చేస్తూ) could ని ఉపయోగిచారు.  ఇక్కడ could model verb.

3. I thought that he should  be at the home.
    అతను ఇంట్లో ఉండాలని నేను అనుకున్నాను. ఈ  వాక్యం లో ఆలోచన (guess) గురించి చెప్పబడింది. ఇక్కడ  should  model verb.

Stative verb 

  Stative verb ఇది చర్య(actions) కంటే స్థితిని(state) వ్యక్తపరుస్తాయి. అనగా  ఆలోచనలు, భావోద్వేగాలు, ఉద్దేశ్యం, సంబంధాలు,  ఇంద్రియాలు,  ఉన్న స్థితులతో  జరిగే చర్యను తెలియజేస్తాయి.

 Examples:

1. I like reading books.
   దీని అర్ధం నాకు బుక్స్ చదవడం ఇష్టం అని. ఇక్కడ "like" stative verb.

2. She is very friendly.
    దీని అర్ధం ఆమె  చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది అని.  ఇక్కడ "is" stative verb.

3. Do you know what I mean that?
     దీని అర్ధం నా ఉద్దేశ్యం మీకు తెలుసా?  అని.  ఇక్కడ "do" stative verb