Usage of prepositions : 

 

ఇప్పుడు మనం   ఒక్కో preposition అర్థం మరియు వాటిని ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం. 

Simple Prepositions :

Astride :  రెండు వైపులా కాళ్లు పెట్టి కూర్చోవటం (బైక్ మీద కానీ , గుర్రం                             మీద కానీ ) Ex : She sat astride the horse. ఆమె గుర్రం                                             మీద  ఇరు వైపులా కళ్ళు పెట్టి కూర్చున్నది 


Bar : (British English)  : Except for somebody/something
          మినహా 
            Example : All bar one of the batsmen scored single digit . 
                                ఒక్క ఆటగాడు మినహా అందరు ఒక్క అంకె score                                          మాత్రమే చేసారు 
Barring : ఒక వేళ ఇది జరగకపోతే అది జరుగుతుంది లేదా జరగాలి లేదా                    జరిగే అవకాశం ఉంది  అని చెప్పడానికి ,
               Example  : Barring rain, we’ll play tennis tomorrow.
                                  వర్షం పడకపోతే, రేపు మనం  టెన్నిస్ ఆడుదాము. 
                     


Concerning (సంబంధించి)  : (related to , about)
I have some questions concerning this issue. 
నాకు ఈ సమస్యకి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. 
Considering (పరిగణలోకి తీసుకుంటే ): (in view of )
Considering his age, he is playing really well. 
అతని వయస్సును పరిగణలోకి తీసుకొని చుస్తే , అతను బాగా ఆడుతున్నాడు.
Counting (లెక్కలోకి తీసుకుంటే ) : (including)
  ఏదైనా కౌంట్ చేసేటప్పుడు,
 ' వీటిని ని కూడా లెక్కలో తీసుకుంటే' అనే అర్థం వస్తుంది. 
Example : There are five people in the car counting the baby.
 పాప ని లెక్కలోకి తీసుకుంటే  కారు లో ఐదుగురు ఉన్నారు . 
Despite (అయినప్పటికీ )  :  
 ఒకదాని  ప్రభావం అసలు లేదు అని చెప్పడానికి వాడుతారు. 
He attended the test despite being ill. 
 అతను అనారోగ్యాంగా ఉన్నప్పటికీ, పరీక్షకు హాజరు అయ్యాడు. 
(అంటే అతని అనారోగ్య ప్రభావం అసలు అతని మీద లేదు అని అర్థం. )

During : ఒకటి జరుగుతున్న సమయం లో లేదా  జరుగుతున్నంతసేపు జరిగే మరొక పని గురించి చెప్పేటప్పడు 

He fell asleep during the class 
అతను క్లాస్ జరుగుతున్నప్పుడు నిద్రపోయాడు. 
He was taken to the hospital during the night.
అతనిని రాత్రి సమయం లో ఆసుపత్రి కి తీసుకెళ్లారు. 
Except (మానహాయించి ) : 
                                                They all came except Gopi.
  గోపి మినహా అందరూ వచ్చారు. 
Excluding : (వాటిని కలపకుండా ) 
                                             Dinner cost is 200 rupess perperson , excluding dessert. 
భోజనం ధర ఒక వ్యక్తికి 200రూపాయలు, డెసెర్ట్ కాకుండా 
Dessert =భోజనం తర్వాత తినే తీపి పదార్థం 
Ex : ఐస్ క్రీం